Sunday, December 22, 2024

మణిపూర్‌లో సామూహిక అత్యాచారంపై మరో మహిళ ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

గువాహటి: మణిపూర్‌లో హింసాకాండ రాజుకున్న మే 3న చురచంద్‌పూర్ జిల్లాలో తనపై కుకీ మూకలు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు హైతేయ తెగకు చెందిన ఒక 37 ఏళ్ల మహిళ జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఆగస్టు 9వ తేదీ(బుధవారం) సాయంత్రం 4.30 గంటలకు బిష్ణుపూర్‌లోని మహిళా పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా..మహిళ ఆరోపిస్తున్న ఘటన చురచంద్‌పూర్ జిల్లాలో జరిగినందున కేసు తదుపరి దర్యాప్తు కోసం ఎఫ:ఆర్‌ను చురచంద్‌పూర్‌లోని మహిళా పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.
స్థానిక మీడియా కథనం ప్రకారం పోలీసులు ఆదేశం మేరకు బాధిత మహిళకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.

మే 4న ఇద్దరు కుకీ తెగకు చెందిన గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఒక వీడియో వెలుగు చూడడంతో దేశవ్యాప్తంగా సంచలనం ఏర్పడింది. మణిపూర్ హ ంసాకాండపై ప్రతిపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గత రెండు రోజులుగా లోక్‌సభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. గురువారం అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News