Monday, November 18, 2024

ఉపహార్ ధియేటర్ అగ్నిప్రమాదం కేసు: అన్సల్ సోదరులకు ఏడేళ్లు జైలుశిక్ష

- Advertisement -
- Advertisement -

Ansal brothers sentenced to 7 years in Uphaar fire accident

న్యూఢిల్లీ : 1997 లో ఉపహార్ సినిమా దియేటర్‌లోజరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి వ్యాపార వేత్త సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్‌కు ఏడేళ్ల జైలు శిక్షఖరారైంది. ఈ కేసులో దోషులుగా ఉన్న ఈ ఇద్దరూ తప్పుడు పత్రాలను సమర్పించిన నేపధ్యంలో కోర్టు వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఉపహార్ ధియేటర్ అగ్నిప్రమాదంలో 59 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన పాటియాలా హౌజ్ కోర్టు సోమవారం ఈ తీర్పును వెలువరించింది. అలాగే వీరిరువురికి 2.25 కోట్ల జరిమానా కూడా విధించింది. గతంలో ఇదే కేసులో ఈ సోదరులిద్దరికీ సుప్రీం కోర్టు రెండేళ్లు శిక్ష విధించింది. వీరిద్దరూ చెరో రూ.30 కోట్లు చెల్లించి విడుదలయ్యారు. ఈ కేసులో నిందితులైన హరిస్వరూప్ పన్వార్, థరమ్‌వీర్ మల్హోత్రాలు కేసు విచారణ సమయంలో మరణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News