Wednesday, January 22, 2025

అన్సారీకి రామాలయ ప్రాణప్రతిష్టకు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

అయోధ్య: రామ జన్మభూమి-బ్రాబీ మసీదు కేసులో ముస్లింల తరఫున కక్షిదారుడైన ఇక్బాల్ అన్సారీకి రామాలయ ప్రాణ ప్రతిష్ట ఉత్సవానికి ఆహ్వానం అందింది. అయోధ్యలోని రామ్ పథ్ సమీపంలోని కోటియా పాంజితొల వద్ద నివసిస్తున్న అన్సారీకి శుక్రవారం ఆహ్వాన పత్రం అందినట్లు ఆయన కుమార్తె తెలిపారు. తన తండ్రికి ఈ రోజు ఉదయం రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానం పత్రం అందచేసినట్లు ఆయన కుమార్తె షామా పర్వీన్ తెలిపారు. కాగా..డిసెంబర్ 31న అన్సారీ విలేకరులతో మాట్లాడుతూ రామ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన తీర్పును ముస్లిం సమాజం గౌరవిస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News