Monday, December 23, 2024

భారత్‌కు మరో మూడు పతకాలు

- Advertisement -
- Advertisement -

ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్

Anshu Malik bags silver

ఉలాన్‌బాతర్ (మంగోలియా): ఇక్కడ జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మరో మూడు పతకాలు సాధించింది. మహిళల విభాగంలో భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్య పతకాలు దక్కాయి. మహిళల 57 కిలోల విభాగంలో అన్షు మాలిక్ రజతం సాధించింది. 65 కిలోల విభాగంలో రాధికకు రజతం లభించింది. మరోవైపు 62 కిలోల విభాగంలో మనీష కాంస్య పతకం గెలుచుకొంది. మంగోలియా వేదికగా నిర్వహిస్తున్న ఆసియా రెజ్లింగ్‌లో భారత రెజర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. మహిళలు, పురుషుల విభాగంలో భారత్‌కు వరుసగా పతకాలు లభిస్తున్నాయి. ఇదిలావుండగా శుక్రవారం జరిగిన 57 కిలోల విభాగం ఫైనల్లో అన్షు మాలిక్ జపాన్ రెజ్లర్ టిసుగుమి చేతిలో పరాజయం చవిచూసింది. ఇక రాధికకు కూడా తుది పోరులో చుక్కెదురైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News