Thursday, January 23, 2025

‘అంటే సుందరానికి’ నాకు చాలా స్పెషల్: నాని

- Advertisement -
- Advertisement -

Ante sundaraniki movie

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’ చిత్రం జూన్ 10న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోనాని మాట్లాడుతూ “టీజర్ అదిరిపోయింది కదా.. దీనికి రెండు రెట్లు ట్రైలర్ వుంటుంది. ట్రైలర్‌కి పదిరెట్లు సినిమా వుంటుంది. ‘అంటే సుందరానికి’ నాకు చాలా స్పెషల్ సినిమా. ఎందుకనేది .. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకే అర్ధమైపోతుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ గురించి మాత్రం ఒక మాట చెప్పాలి. కొన్ని సినిమాలు, కథలు మరో దర్శకుడు తీస్తే ఎలా వుంటుంది ? అని ఊహించుకునే అవకాశం వుంటుంది. కానీ వివేక్ తీసిన సినిమా మాత్రం అతను తప్పా ఎవరూ తీయలేరు. ఈ కథని వివేక్ చెప్పినట్లు ఎవరూ చెప్పలేరు. నజ్రియా తెలుగులో నటిస్తే బావుటుందని చాలా కాలంగా చాలా మంది ప్రయత్నించారు. ఆమె మా సినిమాలో నటించినందుకు నజ్రియాకి చాలా థ్యాంక్స్‌”అని అన్నారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ “నాని, నజ్రియా నటన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. స్క్రిప్ట్ రాసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. కానీ నా టీమ్ నేను రాసింది, ఊహించినదాని కంటే పదిరెట్లు అద్భుతంగా చేశారు” అని తెలిపారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ “స్క్రిప్ట్ చదివినప్పుడే హిట్ అనుకునే సినిమాలు కొన్ని వుంటాయి. అందులో ‘అంటే సుందరానికి’ కూడా వుంది. ఈ స్క్రిప్ట్ వినగానే సూపర్ డూపర్ హిట్ అనుకున్నాం. జూన్ 10న ‘అంటే.. సుందరానికి’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాం”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నజ్రియా, సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి, ఎడిటర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News