Monday, December 23, 2024

అలాంటి క్లాసిక్ సినిమా ‘అంటే సుందరానికీ’

- Advertisement -
- Advertisement -

Ante Sundaraniki Movie Success Meet

“అంటే సుందరానికీ… మాకు గొప్ప అనుభూతినిచ్చిన చిత్రం. మా బ్యానర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం. ఇదో క్లాసిక్. ఈ సినిమా తీసినందుకు నిర్మాతలుగా మేము చాలా గర్వంగా ఫీలవుతున్నాం”అని అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని. నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’. తాజాగా విడుదలై ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ “జంధ్యాల సినిమాలు అహ నా పెళ్ళంట, శ్రీవారికి ప్రేమలేఖ లాంటి క్లాసిక్ సినిమా ‘అంటే సుందరానికీ’. కథని నమ్మి మా కోసం సినిమా చేసిన నానికి కృతజ్ఞతలు. మంచి సినిమాను ఇచ్చిన వివేక్ ఆత్రేయతో వరుసగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం”అని చెప్పారు. హీరో నాని మాట్లాడుతూ “అంటే సుందరానికీ సినిమా విజయం టీం సమిష్టి కృషి. అయితే ఈ సెలబ్రేషన్ కేవలం బాక్సాఫీసు నెంబర్లే కాదు.. ఈ రోజు ప్రేక్షకుల హృదయాలని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా సినిమాకి దక్కిన ప్రేమని, ప్రేక్షకుల ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బ్లాక్ బస్టర్ అనేది సమయం చెబుతుంది. కానీ సినిమా చూసిన వారి కళ్ళల్లో ఆనందం, వారి ప్రేమ విషయంలో ‘అంటే సుందరానికీ’ ఇదివరకే బ్లాక్ బస్టర్ కొట్టేసింది. మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ‘అంటే సుందరానికీ’ కూడా అరుదైన సినిమానే”అని అన్నారు. చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ “అంటే సుందరానికీ సినిమా సక్సెస్ క్రెడిట్ హీరో నానికి, నిర్మాతలకు ఇస్తాను. ఇలాంటి వైవిధ్యమైన కథ వారు ఒప్పుకోకపోయి ఉంటే ఈ రోజు ఈ సినిమాని చూసే అవకాశం వుండేది కాదు. నాని… సుందరం పాత్రని గొప్పగా చేశారు. లీల పాత్రని గొప్పగా పోషించిన నజ్రియాకి థాంక్స్. నరేష్, రోహిణి, హర్ష వర్ధన్, నదియా, వెంకటేష్ మహా ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఇది మ్యూజికల్ మూవీ. వివేక్ సాగర్ గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు”అని తెలిపారు. ఈ వేడుకలో నజ్రియా నజీమ్, వివేక్ సాగర్, అరుణ బిక్షు తదితరులు పాల్గొన్నారు.

Ante Sundaraniki Movie Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News