Monday, January 20, 2025

‘అంతేనా..ఇంకేం కావాలి’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

 

అమ్మ కిచ్చిన మాటను, అమ్మాయి కిచ్చి న మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నా డు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘అంతేనా..ఇంకేం కావాలి’. పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యానర్‌పై వెంకట నరసింహరాజ్ దర్శకత్వంలో రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఝాన్వీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో సినీ అతిరధుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ నటులు మురళీ మోహన్ హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నటుడు దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచాన్ చేశారు.

స్క్రిప్ట్‌ను నటుడు ఘర్షణ శ్రీనివాస్ అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు వెంకట నరసింహరాజ్ మాట్లాడుతూ “మంచి యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ఇది. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూట్‌కు వెళ్తున్నాము. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నాము”అని అన్నారు. చిత్ర నిర్మాత రవీంద్ర బాబు మాట్లాడుతూ కామెడీ, లవ్, సెంటిమెంట్‌తో వస్తున్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని చెప్పారు. చిత్ర హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఫుల్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ఇదని తెలిపారు. ఘర్షణ శ్రీనివాస్, సునీల్, బ్రాహ్మజీ, సుమన్, బిత్తిరి సత్తి, సఫి, ఫిష్ వెంకట్, కరాటే కళ్యాణి, గౌతమ్ రాజు తదితరులు ఈ చిత్రంలో నటిస్తునారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News