Monday, December 23, 2024

“అంతిమ తీర్పు” టైటిల్ లాంచ్

- Advertisement -
- Advertisement -

శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి ధన్సిక, అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “అంతిమ తీర్పు” ఈ చిత్రానికి ఏ.అభిరాం దర్శకత్వం వహిస్తున్నారు. డి. రాజేశ్వరరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తాజాగా ఈ చిత్ర బృందం టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

అమిత్ తివారి మాట్లాడుతూ..
ప్రొడ్యూసర్ గారిని కలిసినప్పుడు ఆయన లో ఒక ప్యాషన్ చూసాను నేను. ఒక మంచి సినిమా తియ్యాలి అని తపన ఆయనలో నాకు కనిపించింది. డి.రాజేశ్వరరావు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. షూటింగ్ మంచి హెల్తీగా జరిగింది.

సాయి ధన్సిక మాట్లాడుతూ…
ఒక సినిమాకు సపోర్ట్ ఇచ్చేది కేవలం మీడియా వాళ్ళే, మీ అందరికి పెద్ద థాంక్స్ అండి. ఈ సినిమాలో అందరు మంచి కేరక్టర్స్ చేసారు. ఒక సినిమాకి ప్రొడ్యూసర్ ఎంత అవసరం అనేది ఈ సినిమా చేస్తున్నప్పుడే నాకు అర్ధమైంది. మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. ఎప్పటిలానే ఈ సినిమాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం.

డైరెక్టర్ అభిరాం మాట్లాడుతూ…
ఇంతకు ముందు ముత్యాల సుబ్బయ్య గారి చాలా సినిమాలకు నేను పనిచేసాను. ఈ సినిమా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ లో జరుగుతుంది. ఈ సినిమాలో సాయి ధన్సిక అద్భుతంగా చేసింది. ఈ సినిమాలో సాయి ధన్సిక, అమిత్ తివారి, నాగమహేష్ గారు మంచి పాత్రలు చేసారు.కోటి గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. నిర్మాత డి. రాజేశ్వరరావు గారు మంచి సపోర్ట్ చేసారు. త్వరలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News