- Advertisement -
నాగపూర్: దేశంలో బిజెపి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కర్నాటలో ఇటీవల వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు కనపడుతోందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ తెలిపారు.
బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆలోచనా ధోరణి ఇలాగే కొనసాగితే రానున్న సార్వత్రిక ఎన్నికలలో దేశంలో మార్పు ఏర్పడుతుందని చెప్పారు. ఇది చెప్పడానికి జ్యోతిష్కుడు అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో చాలా చిన్న సంఘటనలకు మతం రంగు పులుముతున్నారని, ఇది మంచి పరిణామం కాదని ఆయన అన్నారు.
కర్నాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి ఐదేళ్ల తరువాత ఆ రాష్ట్రంలో తిరగి అధికారాన్ని చేపట్టింది. కాగా.లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అదే ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి..
- Advertisement -