- Advertisement -
కొర్బెవ్యాక్స్ టీకా ఉపయోగపడుతుంది
బయలాజికల్ ఈ సంస్థ ఎండీ మహిమా దాట్ల
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో చిన్నారుల్లో యాంటీబాడీలు, రోగ నిరోధక శక్తి పెంచేందుకు కొర్బెవ్యాక్స్ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని బయలాజికల్ ఈ సంస్థ ఎండీ మహిమా దాట్ల పేర్కొన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాము రూపొందించిన కొర్బెవ్యాక్స్ టీకాను దేశంలో 12 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. వివిధ రకాల వ్యాక్సిన్లకు హైదరాబాద్ వేదికైందని అన్నారు. అత్యున్నత రక్షణ ప్రమాణాలతో ఈ వ్యాక్సిన్‌ను రూపొందించామని చెప్పారు.
- Advertisement -