Sunday, January 12, 2025

సరిహద్దు భద్రతకు డ్రోన్ వ్యతిరేక విభాగం

- Advertisement -
- Advertisement -

త్వరలో భారత్ సృష్టి
యుఎవిల ముప్పు తీవ్రం అవుతోంది
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా

జోధ్‌పూర్ : మానవ రహిత గగన వాహనాల (యుఎవిల ) ‘బెడద’ రానున్న రోజుల్లో శ్రుతి మించనున్న దృష్టా భారత్ త్వరలోనే సమగ్ర డ్రోన్ వ్యతిరేక విభాగాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ప్రకటించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో పాకిస్తాన్‌కు దాదాపు 300 కిలో మీటర్ల దూరంలోని బిఎస్‌ఎఫ్ శిక్షణ శిబిరంలో బిఎస్‌ఎఫ్ 60వ ఆవిష్కరణ దినోత్సవ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగిస్తూ, ‘లేజర్ అనుసంధానిత డ్రోన్ నిరోధక తుపాకి అమర్చిన’ వ్యవస్థ తొలి ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని చెప్పారు.

పంజాబ్‌లో భారత్ పాకిస్తాన్ సరిహద్దు పొడుగునా డ్రోన్ల కూల్చివేత, శోధన కేసుల్లో 3 శాతం నుంచి 55 శాతం వరకు పెరుగుదలకు ఇది దోహదం చేసిందని ఆయన తెలియజేశారు. ‘రానున్న రోజుల్లో డ్రోన్ల బెడద మరింత తీవ్రం కాబోతున్నది& రక్షణ, పరిశోధన సంస్థలు, డిఆర్‌డిఒ చేతులు కలపగా ‘మొత్తం ప్రభుత్వ’ దృక్పథంతో ఈ సమస్యను అధిగమించే యత్నం చేస్తున్నాం. రానున్న కాలంలో దేశం కోసం సమగ్ర డ్రోన్ నిరోధక విభాగాన్ని సృష్టించబోతున్నాం’ అని అమిత్ షా చెప్పారు. ఈ ఏడాది పాకిస్తాన్‌తో భారత్ సరిహద్దులో నుంచి 260 పైగా డ్రోన్లను కూల్చివేయడమో, లేక స్వాధీనం చేసుకోవడమో జరిగిందని, 2023లో అటువంటి డ్రోన్ల సంఖ్య దాదాపు 110 అని అధికార డేటా వెల్లడించింది. ఆయుధాలు, డ్రగ్స్ రవాణా చేస్తున్న, ఆవిధంగా కూల్చివేసిన లేదా స్వాధీనం చేసుకున్న డ్రోన్ల సంఖ్య పంజాబ్‌లో అధికంగాను, రాజస్థాన్, జమ్మూలలో అతికొద్దిగాను ఉన్నాయి.

కేంద్ర మంత్రి బిఎస్‌ఎఫ్ సిబ్బంది కవాతును సమీక్షించి, గౌరవ వందనం స్వీకరించారు. ఆయన సాహస అవార్డు విజేతలకు పతకాలు, కొన్ని ఇతర గౌరవ పురస్కారాలు ప్రదానం చేశారు. పాకిస్తాన్ (2289 కిమీ), బంగ్లాదేశ్ (4096 కిమీ)తో భారత సరిహద్దుల భద్రత కోసం ప్రస్తుతం సమగ్ర సమీకృత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ (సిఐబిఎంఎస్) పురోగతిలో ఉందని అమిత్ షా తెలియజేశారు. ‘అస్సాం ధుబ్రి (భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు)లో నదీప్రాంత సరిహద్దు పొడుగునా సిఐబిఎంఎస్ మోహరింపు నుంచి స్పందన ప్రోత్సాహకరంగా ఉందని.

అయితే, కొంత మెరుగుదల అవసరం ఉందని ఆయన చెప్పారు. భారత సరిహద్దుల్లో కంచె ఏర్పాటును పటిష్ఠంచేయడానికి, సరిహద్దులో మౌలిక వసతులు, రోడ్డు, ఇతర సదుపాయాల మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం ‘భారీ’ బడ్జెట్ మంజూరు చేసిందని అమిత్ షా తెలిపారు. మోడీ ప్రభుత్వం 1812 కిమీ రోడ్లతో పాట దాదాపు 573 కొత్త సరిహద్దు పోస్ట్‌లు ఏర్పాటు చేసిందని హోమ్ శాఖ మంత్రి తెలిపారు. బిఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి మాట్లాడుతూ, కొత్తగా శిక్షణ పొందిన 13226 మంది సిబ్బందిని వివిధ బెటాలియన్లలో నియమించినట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News