Sunday, December 22, 2024

డ్రగ్స్ కట్టడికి స్కూళ్లలో ప్రహరీ క్లబ్‌లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాలల్లో డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకు సం బంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మాద క ద్రవ్యాలను అరికట్టేందుకు ప్రభుత్వ, ప్రైవే టు ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్స్‌ను ఏ ర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోలీసులు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల తో కలిసి ప్రహరీ క్లబ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ పాఠశాల వి ద్యా కమిషనర్‌కు
ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాఠశాలలు, విద్య, శిశు సంరక్షణ సంస్థల పరిసర ప్రాంతాలలో మాదకద్రవ్యాల విక్రయాలను ఆపడానికి ప్రహరీ కమిటీలు పనిచేయనున్నాయి.

హైస్కూల్ హెడ్ మాస్టర్, లేదా ప్రిన్సిపాల్ అధ్యక్షులుగా, సీనియర్ టీచర్ లేదా చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ ఉపాధ్యక్షులుగా ఉండే ఈ ప్రహరీ క్లబ్‌లో 6వ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రతి తరగతి నుండి ఇద్దరు చొప్పున విద్యార్థులు, పేరెంట్ టీచర్స్ అసోసియేషన్, స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఒక్కో ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. త్వరలోనే ప్రహరీ క్లబ్స్ మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేయనుంది. కాగా మాదక ద్రవ్యాల మత్తుకు బానిపై విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఓపియం, హెరాయిన్, గంజాయి వంటి వాటికి విద్యార్థులు బానిసలు అవతున్న సంఘటనలు కలకలం లేపుతున్నాయి. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిని దాన్నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో మాదక ద్రవ్యాల వినియోగం, ప్రభావం తీవ్రంగా ఉనేనట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సహకారంతో కేంద్రం గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News