Monday, December 23, 2024

విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -

Anti-drug committee should be formed in educational institutions

కమిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉండాలి
ఆదేశించిన హైదరాబాద్ సిపి సివి ఆనంద్

మనతెలంగాణ, హైదరాబాద్ : విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై విస్కృతంగా ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ వాడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని కోరారు. ఈ మేరకు ప్రతి విద్యాసంస్థలో యాంటీ డ్రగ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండాలని,అందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉండాలని కోరారు. అధ్యాపకులు, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టడం వల్ల డ్రగ్స్‌కు బానిసలుగా మారకుండా చూడవచ్చని అన్నారు. కోవిడ్ తర్వాత విద్యాసంస్థలు మామూలుగా నడుస్తున్నాయని తెలిపారు. డ్రగ్స్ విక్రయిస్తున్న విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్‌పై విస్కృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్ వెంటనే సమావేశం నిర్వహించి డ్రగ్స్‌పై అవగాహన కల్పించాలని అన్నారు. డ్రగ్స్‌పై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు చెప్పాలని కోరారు. హైదరాబాద్ పోలీస్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ మొబైల్ నంబర్ 8712661601, 04027852080కు ఫోన్ చేయాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News