Sunday, December 22, 2024

రైతు వ్యతిరేకి రేవంత్‌రెడ్డి: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

పటాన్ చెరు: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి అని ఎమ్మెల్యే మహిపాల్ ఎరడ్డి అన్నారు. రాష్ట్ర బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు బుధవారం మండల పరిధిలోని ఇస్నాపూర్ ముంబాయి జాతీయ రహదారిపై బిఆర్‌ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రెవంత్ రెడ్డి రైతులపై చేసిన వాఖ్యాలు అత్యంత దారుణమన్నారు. దేశానికే వెన్నె ముకలాంటి రైతులను అవమానపర్చే విధంగా మాట్లడం సహించరానిదన్నారు.

రైతులంటే కాంగ్రెస్‌కి పట్టింపులేదన్నారు. రైతు లేకుంటే దేశమంతా ఆకలితో అలమటిస్తుందన్నారు. రైతులకు 3 గంటలపాటు విద్యుత్ అందిస్తేచాలనడం సిగ్గు చేటన్నారు. రేవంత్ రెడ్డి మాటలతో రైతులకు పాత రోజులు గుర్తువచ్చే విధంగా ఉన్నాయన్నారు. రైతులకు విద్యుత్ సరఫరాపై అవగాహనలేకనే ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతున్నాడన్నారు. రైతులపై కనీస అవగహనలేని నాయకున్ని అధ్యక్షున్ని చేయడం తెలంగాణ రైతంతాంగం చేసుకున్న పాపమన్నారు.మన సీఎం రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసుతొని 24 గంటల విద్యుత్ అందిస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News