Monday, December 23, 2024

రైతు వ్యతిరేక ద్రోహి రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ధర్మపురి: అధికార దాహంతో బ్లాక్ మెయిలర్ అయినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులపై కక్షకట్టి రైతుద్రోహిగా తేలిపోయాడని పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగానికి మూడు గంటల విద్యుత్ సరఫరాపై పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం ధర్మపురిలో బీఆర్‌ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, డిసి ఎమ్మెస్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు ఏజంట్ అయిన రేవంత్ రెడ్డి వందల కోట్లు వెచ్చించి అధ్యక్ష పదవి పొందాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే మందుస్తాయిలో నిలిపారన్నారు.

అజ్ఞాని అయినటువంటి రేవంత్ రెడ్డి వ్యవసాయానికి మూడు గంటలు సరిపోతాయని అమెరికా పర్యటనలో ఎన్‌ఆర్‌ఐలతో చెప్పడం చూస్తే పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులను నట్టేట ముంచడం ఖాయంగా కనిపిస్తుందని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పెదాక బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జెడ్పిటీసీ బత్తిని అరుణ, పార్టీ మండల అధ్యక్షడు మొగిలి శేఖర్, ఎఎంసి వైస్ చైర్మన్ అక్కనపెల్లి సునీల్ కుమార్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్‌లు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News