Sunday, November 24, 2024

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరస్తిస్తూ ధర్నా…

- Advertisement -
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ
కార్మిక సంఘాల రెండు రోజుల మహా ధర్నాలకు ఏ ఐ వై ఎఫ్ సంపూర్ణ మద్దతు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నేడు, రేపు (ఈ నెల 9,10) తేదీలలో అఖిల భారత కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎంటీయూసీ,సీఐటీయూ,హెచ్‌ఎంఎస్,ఐఎఫ్టీయూ,టీఎంటీయూసి లతో పాటు 13 కార్మిక సంఘాల పిలుపులో భాగంగా దేశ వ్యాప్తంగా మహా ధర్నాలకు అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర లు తెలిపారు. ఈ ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన సంఘ నేతలు ప్రత్యక్షంగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మందబలంతో బరితెగించి ప్రజా, కార్మిక వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నదని, జాతీయ సహజ వనరులు, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పోరేట్లకు అమ్మేస్తున్నదని వారు ఆరోపించారు.

Also Read: వంతెన కట్టకపోతే ఎన్నికల బహిష్కరణ

డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ లో మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా రద్దు చేసి ఒక సంవత్సరం పాటు సాగిన కార్మిక, కర్షక ప్రజల ఉద్యమంతో ఆ చట్టాలను ఉపసంహరించుకున్నదని గుర్తుచేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు మరోసారి సమరశీల పోరాటాలకు సిద్దం కావాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో 9 ఏళ్ళ మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిల భారత కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ‘క్విట్ ఇండియా డే‘ ప్రచార క్యాంపెయిన్‌ను ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాద్ తో సహా అన్ని జిల్లాల్లోను మహాధర్నా కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు పిలుపునిస్తున్నమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News