Sunday, December 22, 2024

కెనడాలో ఆలయ గోడలపై మోడీ వ్యతిరేక రాతలు

- Advertisement -
- Advertisement -

టోరంటో: కెనడాలోని ఒక ప్రముఖ హిందూ ఆలయం గొడలపై భారత వ్యతిరేక విద్వేషపూరిత రాతలు వెలుగుచూశాయి. ఖలిస్తానీ తీవ్రవాదులు రాసి ఈ రాతలను కెనడాలోని భారతీయ దౌత్య కార్యాలయం ఖండించింది. ఈ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కెనడా ప్రభుత్వానికి భారత ఎంబసీ విజ్ఞప్తి చేసింది. కెనాడలోని మిస్సిసాగాలోగల రామాలయంపై ఫిబ్రవరి 13న ఈ రాతలు కనిపించాయి.

ఈ సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని కెనడా అధికారులను కోరుతున్నామని గోరంటోలోని భారత కాన్సులేట్ మంగళవారం ట్వీట్ చేసింది. మిస్సిసాగాలోని శ్రీరామ మందిరంపై ఫిబ్రవరి 13న విద్వేషపూరిత రాతలు దర్శనమిచ్చాయని, ఇది తమను ఆందోళనకు గురిచేసిందని ఆలయ నిర్వాహకులు తమ అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్టు చేశారు. ఆలయ గోడలపై ఖలిస్తానీ అనుకూల, భారత వ్యతిరేక రాతలను గుర్తుతెలియని వ్యక్తులు పెయింట్ చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రవాదిగా ప్రకటించాలంటూ ఆలయ గోడలపై రాతలు కనిపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News