Thursday, November 21, 2024

కల్తీ కల్లులో నిషేధిత ఆల్ఫ్రాజోలం డ్రగ్ వినియోగం..నలుగురు నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మత్తు పదార్థాల విక్రయం, రవాణా చేస్తున్న నిందితులపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఝుళిపిస్తోంది. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అనే మాట విన బడడానికి వీల్లేదని, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలన్న సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో స్థానికుల సమాచారంతో యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీసుల సోదాలు చేపట్టారు. సంగారెడ్డి శివారులోని ఫసల్‌వాడిలో టిఎస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో, రూరల్ పోలీసులు సయుక్తంగా దాడులు నిర్వహించి 70 లక్షల విలువ గల నిషేధిత ఆల్ఫ్రాజోలం తయారీకి వాడే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నా రు. వీరిలో ఇద్దరు పాత నేరస్థులు ఉన్నట్లు సంగారెడ్డి ఎస్‌ఫి చెన్నూరు రూపేశ్ వెల్లడించారు.

అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న నాలుగు కేంద్రాలను గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలి పారు. గ్రామ శివారులో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఆల్ఫ్రాజోలం తయారీకి రంగం సిద్దం చేసినట్లు గుర్తించామన్నారు. ఈ రసాయనాలు 3వ స్టేజెస్‌లో ఉండ గా పట్టుకున్నట్లు వివరిం చారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రసాయనాన్ని కల్తీ కల్లు తయారీలో వినియోగిస్తున్నారన్నారు. ప్రధానంగా సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉండటంతో ఆల్ఫ్రాజోలం తయారీకి అనువుగా వినియోగించుకుంటు న్నారని తెలిపారు. 2 వేల లీటర్ల కల్లు తయారీకి ఒక చిన్న ముక్క ఆల్ఫ్రాజోలం కలిపితే సరిపోతుందని వెల్లడించారు. ఈ డ్రగ్ చాలా ప్రమాదక రమైందని దీని వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు కలుగుతుందని వైద్యులు చెప్పారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News