Saturday, February 22, 2025

సిక్కు అల్లర్ల కేసులో తీర్పును రిజర్వు చేసిన కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన హత్య కేసులో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్‌కు శిక్ష విధించడాన్ని ఢిల్లీ కోర్టు ఫిబ్రవరి 25కి రిజర్వ్ చేసింది. సజ్జన్ కుమార్ ప్రేరేపించాడని ఆరోపించబడిన ఓ గుంపు చేతిలో తన భర్త, కుమారుడు హత్యకు గురయ్యారని ఫిర్యాదుదారు, ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హజరై విన్నవించుకున్నారు. అంతేకాక సజ్జన్ కుమార్‌కు గరిష్ఠంగా మరణశిక్ష విధించాలని కోరారు. ఫిర్యాదుదారు తరఫు సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫూల్క ‘నిందితుడు ఆ ముఠాలకు నాయకుడు కావడంతో ఇతరులను జాతీ నిర్మూలనకు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు, క్రూరమైన హత్యలకు ప్రేరేపించాడు, అతనికి మరణ శిక్షకు తప్ప మరి దేనికి అర్హుడు కాదు’ అని వాదించారు.

ఇదిలావుండగా రెండు రోజుల్లోగా తన లిఖితపూర్వక వాదనలను దాఖలు చేయాలని కుమార్ తరఫు న్యాయవాదిని కోర్టు కోరింది.1984 నవంబర్ 1న జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్ చంపబడ్డారు. కాగా ఫిబ్రవరి 12న కోర్టు కుమార్‌ను దోషిగా నిర్ధారించింది, మరణ శిక్ష విధించదగిన కేసులలో అటువంటి నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం తీహార్ కేంద్ర కారాగారం నుంచి అతని మానసిక, మానసిక మూల్యాంకనంకు సంబంధించిన నివేదికను ఢిల్లీ కోర్టు కోరింది. సజ్జన్ కుమార్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

హత్య కేసులో కనిష్ఠ శిక్ష జీవిత ఖైదు కాగా, గరిష్ఠ శిక్ష మరణ శిక్ష. పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్ కేసును రిజిష్టర్ చేసినప్పటికీ, తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును చేపట్టింది. కాగా కోర్టు 2021 డిసెంబర్ 16న సజ్జన్ కుమార్‌పై ‘ప్రైమా ఫేసీ’ కేసు నమోదైందని తేల్చింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతిగా ఆయుధాలు ధరించిన గుంపు సిక్కులపై, సిక్కుల ఆస్తులపై దాడికి పాల్పడింది. 1984 నాటి ఆ దాడిలో హత్యలు చేశారని, ఆస్తులు కొల్లగొట్టారని, తమ ఇల్లు తగులబెట్టారని జశ్వంత సింగ్ భార్య ఫిర్యాదు చేశారు.

నాటి అల్లర్లపై నానావతి కమిషన్ దర్యాప్తు చేపట్టి నివేదికను సమర్పించింది. నాటి అల్లర్లకు సంబంధించి 587 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి, అల్లర్లలో 2733 మంది చనిపోయారు. దాదాపు 240 ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు మూసేశారు. 587 ఎఫ్‌ఐఆర్‌లలో 28 కేసుల్లో మాత్రం శిక్ష పడింది. వీటిలో దాదాపు 400 మందిని దోషులుగా నిర్ధారించారు. సజ్జన్ కుమార్ సహా 50 మందిని హత్య కేసులో దోషులుగా నిర్ధారించారు. సజ్జన్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. కాగా ఆ తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అది ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News