- Advertisement -
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా లోని మెల్‌బోర్న్ నగరంలో యాంటీ వ్యాక్సిన్ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్ లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కనీసం టీకా ఒక్క డోసు అయినా వేసుకుని పనికి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ వందలాది నిర్మాణ రంగ కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకోడానికి పోలీసులు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ రేగింది. ఆందోళన కారులను చెదర గొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు, రబ్బరు తూటాలను ప్రయోగించారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీస్ అధికారులు సహా పలువురికి గాయాలయ్యాయి. 40 మందికి పైగా ఆందోళన కారులు అరెస్టయ్యారు. మరో వైపు మంగళవారం ఒక్క రోజే విక్టోరియాలో 603 కొత్త కేసులు, ఒక మరణం నమోదయ్యాయి.
- Advertisement -