Wednesday, January 22, 2025

వాయు కాలుష్యంతో యాంటీబయోటిక్ నిరోధకం

- Advertisement -
- Advertisement -

వాయుకాలుష్యంతో మందులను ప్రతిఘటించే శక్తి పెరిగి మనుషుల ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతుందని ప్రపంచ స్థాయి అధ్యయనం వెల్లడించింది. దాదాపు వంద దేశాల నుంచి గత రెండు దశాబ్దాలుగా సేకరించిన డేటా ఆధారంగా ఈ అధ్యయనం సాగింది. ప్రతి దేశం, ప్రతిఖండం లోనూ ఈ పరిస్థితి విస్తరించిందని అధ్యయనం వెల్లడించింది. కాలుష్యానికి, మందులను ప్రతిఘటించే శక్తికి మధ్య ఉన్న సంబంధం రానురాను బలోపేతమవుతోందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వాయుకాలుష్యం ఎలా యాంటిబయోటిక్‌లను నిరోధించ గలుగుతుందో మొట్టమొదటిసారి ఈ విశ్లేషణ చెప్పగలిగిందని చైనా, బ్రిటన్ పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు.

ఈ అధ్యయనం వివరాలు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో వెలువడ్డాయి. మందులకు లొంగని పరిస్థితికి వాయుకాలుష్యానికి ఉన్న సంబంధం మొట్టమొదటి సారి ఈ అధ్యయనం వెల్లడించింది. యాంటీబయోటిక్‌ల వ్యతిరేకత అన్నది ప్రపంచం మొత్తం మీద ఆరోగ్యానికి తీరని ముప్పుగా వేగంగా పరిణమిస్తోంది. ఈ కారణం గానే ఏటా 1.3 మిలియన్ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మందులను తప్పుగా వినియోగించడం, అతిగా వినియోగించడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సంబంధం గురించి సైన్సు పరంగా అధ్యయనం దృష్టి పెట్టకపోయినా, కొన్ని సాక్షాధారాల బట్టి చెప్పగలుగుతున్నారు. పర్టిక్యులేట్ మేటర్ పిఎం 2.5, యాంటీబయోటిక్‌ను నిరోధించే బ్యాక్టీరియాను , ఎదిరించే జన్యువులను కలిగి ఉంటుందని చెబుతున్నారు.

ఇవి పర్యావరణం లో వ్యాపించి మనుషుల శ్వాస ద్వారా నేరుగా లోపలికి ప్రవేశిస్తాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ప్రజారోగ్యానికి వాయుకాలుష్యం ఇప్పటికే అత్యంత ప్రమాదకరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం వాయుకాలుష్యానికి ప్రభావితం కావడం గుండెజబ్బులు, ఆస్తా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి దాపురిస్తున్నాయి. ఆయు ప్రమాణం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అత్యంత కాలుష్యం స్థాయిలు తక్కువ సమయంలో ప్రభావం చూపించినా, దగ్గు, ఆస్తా వంటి రుగ్మతలు కనిపిస్తుంటాయి. ఆస్పత్రిలో చేరే పరస్థితులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని ఎంతవరకు నిరోధించ గలిగితే అంత మేరకు మందులను నిరోధించే ప్రభావం తగ్గుతుందని ఈ అధ్యయనం సూచిస్తోంది. అలాగే వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తే మరణాలు కూడా తగ్గుతాయి. యాంటీబయోటిక్ నిరోధత వల్ల సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు కూడా చాలావరకు నివారించగలుగుతాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News