హైదరాబాద్: హైకోర్టులో ఎంపి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ అనుమతించింది. అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యాహ్నం 2.30 గంటలకు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. తనకు 160 సిఆర్‌పిసి కింద తనకు నోటీస్ ఇచ్చారని ఎంపి అవినాష్ రెడ్డి తెలిపారు. 161 సిఆర్‌పిసి కింద సిబిఐ అధికారులు తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారన్నారు.
Also Read: ధోనీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్..
వివేకా కుమార్తె సునీత స్థానిక ఎంఎల్‌సితో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సిబిఐ అధికారితో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారు. వెఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో తనని కుట్ర పన్ని ఇరికిస్తున్నారని మండిపడ్డారు. తనక ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. గూగుల్ టేకౌట్ ఆధారంగానే తనని నిందితుడిగా చేర్చే ప్రయత్నం ఎందుకు చేశారని ప్రశ్నించారు. వివేకా కేసులో ఎంపి అవినాష్ రెడ్డిని సిబిఐ నిందితుడిగా చేర్చడంతో పాటు సోమవారం విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.