Sunday, December 22, 2024

విషపూరిత పుట్టగొడుగుల్లోని విషానికి విరుగుడు పదార్థం

- Advertisement -
- Advertisement -

ప్రపంచం మొత్తం మీద అత్యంత విషపూరిత డెత్‌క్యాప్ పుట్టగొడుగుల్లో విషానికి విరుగుడు పదార్ధాన్ని చైనా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పుట్టగొడుగుల ఆహార సంబంధిత మరణాల్లో 90 శాతం మరణాలకు ఈ అమనిట ఫెల్లాయిడెస్ అనే ఈ విషపూరిత డెత్‌క్యాప్ పుట్టగొడుగులే ప్రధాన కారణమని తెలుసుకున్నారు. ఇందులోని ప్రధాన విషపదార్ధం పెప్టైడ్ . దాన్ని ఎ అమనిటిన్ అని పిలుస్తారు.

ఇది ఒకరకమైన విషపదార్థం. ఇది కాలేయాన్ని, మూత్రపిండాల్ని విఫలం చేస్తుంది. చైనా, ఆస్ట్రేలియా పరిశోధకులు డెత్‌క్యాప్ పుట్టగొడుగుల్లోని ఎఅమనిటిన్ విష ప్రభావాన్ని రంగులకు ఉపయోగించే ఇండో సైనైన్ గ్రీన్ అనే డై అడ్డుకుంటుందని కనుగొన్నారు. ఈమేరకు ప్రయోగశాలలో ఎలుకల, మనుషుల కణాలపై ప్రయోగాలు చేయగా ఎ అమనిటిన్ ప్రేరేపిత కాలేయం, మూత్రపిండాల వైఫల్యాన్ని ఇండోసైనైన్ గ్రీన్ నివారించగలిగినట్టు రుజువైంది. విషప్రభావం తరువాత మనుగడ సాగించే అవకాశం అభివృద్ధి చెందినట్టు తెలుసుకున్నారు. ప్రస్తుత ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, మనుషుల్లో ఇండోసైనైన్ గ్రీన్ ఇదే ప్రభావం కలిగి ఉంటుందో లేదో తేల్చడానికి మరిన్ని ట్రయల్స్ అవసరమవుతాయని చైనా లోని చాంగ్‌ఝో కు చెందిన సన్ యెట్ సేన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కియావోపింగ్ యాంగ్ చెప్పారు.

Also Read: మహిళల్లో ఎనీమియా తీవ్రత..

ఇలాంటి డెత్‌క్యాప్ పుట్టగొడుగులు అసాధారణ ప్రమాదకర విషపూరితమైనవని, తరచుగా మిగతా పుట్టగొడుగుల్లా వీటిని పొరపాటున గ్రహిస్తుంటారని సిడ్నీలోని రాయల్ బొటానిక్ గార్డెన్స్ చీఫ్ సైంటిస్టు ప్రొఫెసర్ బ్రెట్ సమ్మెరెల్ హెచ్చరించారు. ఈ డెత్‌క్యాప్ పుట్టగొడుగులు మొదట్లో పెరుగుతున్నప్పుడు ఆహారానికి, వంటకాలకు ఉపయోగించే మిగతా రకాల మాదిరి పోలి ఉంటాయని , ముఖ్యంగా ఆసియా వంటకాల్లో పుట్టగొడుగుల వాడకం పరిపాటిగా వస్తోందని తెలిపారు. ఈ పెరుగుతున్న దశలో ఇవి తెల్లగా ఉంటాయి కాబట్టి పుట్టగొడుగుల్లోని రకాలను పోల్చుకోవడం కష్టంగా చెప్పారు.

Also Read: పిల్లల్లో “ఆస్తమా”.. అవగాహనే సరైన ధీమా

కొంచెం పెరిగాక వాటి డెత్‌క్యాప్‌లు ఆకుపచ్చ, పసుపు రంగుగా మారతాయని వివరించారు. విషపూరిత డెత్‌క్యాప్ పుట్టగొడుగులు ఓకు చెట్ల వేళ్లపై ఆధారపడి బతుకుతుంటాయి. ఓకు చెట్ల కింద పెరిగే పుట్టగొడుగులను చూసినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పారు. కొన్ని రకాల పుట్టగొడుగుల్లో విషపదార్థాలు వేడికి కరిగిపోతాయి. కానీ డెత్‌క్యాప్ పుట్టగొడుగుల్లోని విషపదార్ధాలు మాత్రం వండినా అలాగే బలంగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా విషాహార మరణాల్లో పుట్టగొడుగుల విషప్రభావం చాలా ఎక్కువ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News