- Advertisement -
నేడు ప్రధాని మోడీ, జైశంకర్‌లతో చర్చలు
న్యూఢిలీల్ల: భారత్‌లో రెండు రోజుల పర్యటన కోసం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌లతో ఆయన చర్చలు జరుపుతారు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటుగా భారత్ అమెరికా అంతర్జాతీయ భాగమ్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్ల్లడంతో పాటుగా దేశంలో మానవ హక్కుల పరిస్థితిపై మోడీ, జైశంకర్‌లతో చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు రావచ్చని తెలుస్తోంది. అలాగే ఇరు దేశాలు కలిసి కొవిడ్ వ్యాక్సిన్ల తయారీ అంశం కూడా వీరు చర్చించే అవకాశం ఉంది. బైడెన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్లింకెన్ భారత్‌లో జరపుతున్న తొలి పర్యటన ఇదే కావడం విశేషం.భారత్‌లో పర్యటన అనంతరం ఆయన కువైట్ బయలుదేరి వెళ్తారు.
- Advertisement -