Sunday, December 22, 2024

న్యూ ఏజ్ జానర్ కథ..

- Advertisement -
- Advertisement -

Anu Emmanuel About 'Urvasivo Rakshasivo' Movie

అల్లు శిరీష్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్ అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలిలేని, విజయ్ ఎం నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది ఈ సినిమా. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్ మాట్లాడుతూ “ఇందులో సింధూ అనే సాఫ్ట్‌వేర్ అమ్మాయిగా నటించా. కెరీర్‌లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. ఆమెకి ప్రేమ కావాలి. కానీ ప్రేమే జీవితం అనుకోదు. అలాంటి అమ్మాయికి శ్రీకుమార్ అనే సింపుల్ కుర్రాడు పరిచయం అవుతాడు. సింపుల్ కుర్రాడికి, కెరీర్ ఓరియెంటెడ్ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అన్నది కథ. హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అదే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. న్యూ ఏజ్ జానర్ కథ ఇది. యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది” అని తెలిపారు.

Anu Emmanuel About ‘Urvasivo Rakshasivo’ Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News