వికారాబాద్ ప్యాట్నీసెంటర్ చందన బ్రదర్స్ లో అను ఇమ్మాన్యుయ‌ల్..

510
Anu Emmanuel Inaugurates Chandana Brothers Shopping Mall in Vikarabad

వికారాబాద్: తెలంగాణ ప్రజలకు ఎంతో సుపరిచితమైన ప్యాట్నీసెంటర్ చందన బ్రదర్స్ వారి మరో షాపింగ్ మాల్ ఇప్పుడు మన వికారాబాద్ లో సినీతార అను ఇమాన్యుయల్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరుపుకున్నది. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ లు పాల్గొన్నారు. ఆ చుట్టుప్రక్కల ఇదే అతి పెద్ద షాపింగ్ మాల్ కావడం విశేషం.

వికారాబాద్ లో ఇక్కడే అన్ని హంగులతో 2 అంతస్థులలో 15,000 చ॥ అడుగులలో సువిశాలమైన సకుటుంబ వస్త్ర ప్రపంచం అత్యాధునికంగా అంత‌ర్జాతీయ షాపింగ్ అనుభూతి మీకు అందిస్తూ…కుటుంబమంతటకీ కావలసిన వస్త్రాలు హోల్ సేల్ ధరలకే విక్రయిస్తున్నామనీ, అలాగే సుమారు 100 మందికి ఉపాధి కలిపిస్తున్నామని సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ తెలిపారు. ఇంతగా ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్న తెలంగాణా ప్రజలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.