Wednesday, January 22, 2025

సిజెఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు ఏఎన్‌యూ గౌరవ డాక్టరేట్‌

- Advertisement -
- Advertisement -

ANU Honorary Doctorate to CJI Justice NV Ramana

హైదరాబాద్: సీజేఐ ఎన్వీ రమణకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనుంది. ఈ నెల 20న వర్సిటీలో జరిగే 37, 38వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్‌ అందజేస్తామని వర్సిటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ వెల్లడించారు. విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన ఆయనను డాక్టరేట్‌తో గౌరవించాలని వర్సిటీ నిర్ణయించగా.. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కులపతి హోదాలో గవర్నర్‌ నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. ఈ నెల 20న వర్సిటీలో జరిగే 37, 38వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్‌ అందజేస్తామన్నారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్‌ ఎన్వీ.రమణను విశ్వవిద్యాలయం ఆహ్వానించింది.

ఆయనకు వర్సిటీ తరఫున గౌరవ డాక్టరేట్‌ ఇవ్వాలని ఈ ఏడాది మార్చి నుంచి పలుమార్లు ప్రయత్నించామని, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందని, ఆ కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని వీసీ అన్నారు. విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసించిన మొదటి బ్యాచ్‌ విద్యార్థిగా ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వడం సముచితమంటూ ఈ అరుదైన అవకాశం వర్సిటీకి దక్కడంపై ఆచార్య రాజశేఖర్‌ ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం ఏఎన్‌యూలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలోనూ వీసీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి స్నాతకోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. గౌరవ డాక్టరేట్‌ ఇవ్వనున్న విషయంపై జస్టిస్‌ ఎన్వీ.రమణకు సమాచారం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. స్నాతకోత్సవానికి ఛాన్స్‌లర్‌ హోదాలో గవర్నర్‌ హాజరవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News