Tuesday, December 24, 2024

అమాయకత్వం నుండి పుట్టే కామెడీ ఇష్టం

- Advertisement -
- Advertisement -

Anudeep Interview about 'First Day First Show'

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’. ‘జాతి రత్నాలు’తో బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో అనుదీప్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..“ఒక చిన్న టౌన్, థియేటర్, సినిమా టికెట్ల కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటి నేపధ్యంలో ఎప్పటినుండో సినిమా చేయాలని వుండేది. ప్రేక్షకులకు కూడా ఒక కొత్త జోనర్ చూసినట్లు వుంటుంది. ‘ఖుషి’ సినిమా నేపధ్యాన్ని తీసుకొని ఈ కథని చెబుతున్నాం. శ్రీకాంత్ నా స్నేహితుడే. అయితే ఆడిషన్స్ చేసి నిర్మాతలకు నచ్చిన తర్వాతే తీసుకున్నాం. శ్రీకాంత్‌లో మంచి హ్యుమర్ వుంటుంది. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’లో కూడా హిలేరియస్ హ్యుమర్ వుంటుంది. కొత్త వాళ్ళు అంతా చక్కగా చేశారు. వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి లాంటి అనుభవజ్ఞులు కూడా ఈ సినిమాలో వున్నారు. ఈ సినిమాకు మొదట నేనే దర్శకత్వం చేయాలని అనుకున్నా. నా సహాయ దర్శకులకు కథ బాగా నచ్చడంతో వారికి ఇవ్వడం జరిగింది.

వంశీ మరో దర్శకుడు వుంటే బావుందని అన్నారు. అలా లక్ష్మీ నారాయణ మరో దర్శకుడిగా వచ్చారు. నేను షూటింగ్‌లో లేను కానీ స్క్రిప్ట్, ఎడిటింగ్, నేపధ్య సంగీతం… ఇలా చాలా అంశాలలో నా పాత్ర వుంది. ఈ సినిమా ఫలితం విషయంలో నా భాద్యత ఉంటుంది. ఛార్లీ చాప్లీన్ ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. అలాగే రాజ్ కపూర్. అమాయకత్వం నుండి పుట్టే కామెడీ నాకు చాలా ఇష్టం. అమాయకత్వం అందరికీ కనెక్ట్ అవుతుంది. హారర్, వయోలెన్స్ తప్పా.. మిగతా అన్నీ జోనర్స్ ఇష్టం. మంచి డ్రామా వున్న కథలు కూడా రాయాలని వుంది.ఇక శివకార్తికేయన్‌తో నేను చేస్తున్న ‘ప్రిన్స్’ పాండిచ్చేరి నేపధ్యంలో సాగే కథ. షూటింగ్ దాదాపు పూర్తయింది. దీపావళికి రిలీజ్ వుంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. హ్యుమర్ కూడా వుంటుంది”అని అన్నారు.

Anudeep Interview about ‘First Day First Show’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News