మాసీవ్ బ్లాక్‌బస్టర్స్ సలార్, కల్కి 2898 ఏడి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రముఖ పాన్-ఇండియా స్టూడియో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం లార్జర్ దెన్ లైఫ్ ఎలిమెంట్స్ తో విజువల్ వండర్ గా ఉండబోతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ చాలా ముఖ్యమైన పాత్ర కోసం ఎంపికయ్యారు. ఈ వార్తను ఆయన స్వయంగా షేర్ చేశారు. గొప్ప పాత్రలు చేయడంలో పేరుపొందిన అనుపమ్, ఈ సినిమా స్క్రిప్ట్‌ను ‘అద్భుతం‘ అని అన్నారు. ప్రభాస్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడానికి ఉత్సాహంగా వున్నారు. దర్శకుడు హను రాఘవపూడి ప్రతిభను కూడా ఆయన ప్రశంసించారు.
“ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్ తో నా 544వ చిత్రాన్ని ప్రకటించినందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి అద్భుతమైన ప్రతిభావంతులైన హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ అద్భుతంగా నిర్మిస్తున్నారు”అని అనుపేమ్ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రం ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ మూవీ మేకర్స్‌ల ఫస్ట్ కొలాబరేషన్. 1940 హిస్టారికల్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి పోరాటం చేసే ఓ యోధుడి కథగా ఈ సినిమా ఉండబోతోంది. ఇమాన్వి ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, వెటరన్ యాక్టర్స్ మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని , వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.