Monday, December 23, 2024

క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలీవుడ్ నటి

- Advertisement -
- Advertisement -

 

Mahima Chaudhary

ముంబై: తొలి సినిమాలోనే షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరో సరసన నటించి ఫేమ్ సంపాదించుకున్న బాలీవుడ్ నటి మహిమా చౌదరి . ‘పర్‌దేస్’  సినిమాతో బీ టౌన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా మహిమ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్  సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఆమె ప్రస్తుతం ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాటం చేస్తోందని ఓ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.

మహిమా చౌదరి క్యాన్సర్‌ పోరాటాన్ని సోషల్ మీడియాలో అనుపమ్ ఖేర్  షేర్ చేశాడు ‘‘నా 525వ సినిమా ‘ద సిగ్నేచర్’ లో ఓ కీలక పాత్ర కోసం మహిమా చౌదరిని సంప్రదించాను. నెల రోజుల క్రితం అమెరికా నుంచి ఆమెకు ఫోన్ చేశాను. మాటల సందర్భంలో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసింది. ఆమె వ్యక్తిత్వం ప్రపంచంలోని మహిళలందరికి నమ్మకాన్ని ఇస్తుంది. ఆమెకు రొమ్ము క్యాన్సర్ సోకిందనే విషయాన్ని బయటకు వెల్లడించమని  నన్ను కోరింది. నిజమైన శ్రేయోభిలాషిగా నన్ను అభివర్ణించింది. కానీ, మహిమ నాకు ప్రియమైన వ్యక్తి.   ఆమెకు దీవెనలు, ఆశీస్సులు, ప్రేమను అందించండి. మహిమ సినిమా సెట్లోకి వచ్చేసింది. నటించడానికీ సిద్ధంగా ఉంది. సినిమా పరిశ్రమలోని దర్శకులు, నిర్మాతలారా ఆమె నట విశ్వరూపాన్ని చూపించడానికి మీకు అవకాశం వచ్చింది’’ అని అనుపమ్ ఖేర్ తెలిపాడు.

అనుపమ్ పోస్ట్‌ను మహిమ రీ పోస్ట్ చేసింది. ‘‘నా మీద అప్యాయత చూపిస్తూ, ప్రోత్సహం అందిస్తున్నందుకు ప్రియమైన అనుపమ్ ఖేర్‌కు థ్యాంక్యూ’’ అని మహిమా చౌదరి పేర్కొంది. గతంలో సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా, హంస నందినిలకు క్యాన్సర్స్ సోకిన సంగతి తెలిసిందే. ఇక కెరీర్ విషయానికి వస్తే.. మహిమ చౌదరి ‘దాగ్: ది ఫైర్’, ‘దీవానే’ , ‘కురుక్షేత్ర’ వంటి సినిమాల్లో నటించింది. చివరగా ‘డార్క్ చాక్లెట్’ లో కనిపించింది. ఈ చిత్రం 2016లో విడుదలైంది. మహిమకు ఓ కూతురుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News