మాస్ మహారాజా రవితేజ తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం జాతీయ అవార్డ్ గ్రహీత, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్‌ను ఎంపిక చేశారు. ‘టైగర్ నాగేశ్వర రావు’ నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’లో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని చేరిక సినిమా కాస్టింగ్ డిపార్ట్‌మెంట్ స్థాయిని పెంచడమే కాకుండా హిందీ మార్కెట్‌కు కూడా సహాయపడుతుంది. ‘టైగర్ నాగేశ్వరరావు’ పేరు మోసిన స్టువర్ట్‌పురం దొంగ బయోపిక్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా కోసం రవితేజ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. డిక్షన్, డైలాగ్ డెలవరీ, గెటప్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటూ, మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించబోతున్నారు ఈ స్టార్ హీరో. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Anupam Kher to play Key Role in ‘Tiger Nageswara Rao’