Saturday, December 21, 2024

మనకు తెలియకుండా జరిగేదే లవ్..

- Advertisement -
- Advertisement -

నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 18 పేజిస్. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా శుక్రవారం విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

క్రేజీ లవ్ స్టోరీ…
18 పేజెస్ సినిమాకు ‘కార్తికేయ 2’ సినిమా చేయకముందే సైన్ చేశాను. 18 పేజెస్ సినిమాతో పాటు కార్తికేయ 2 సినిమా కూడా ఒకేసారి చేశాము. ఆది అడ్వెంచర్ మూవీ అయితే ‘18 పేజెస్’ క్రేజీ లవ్ స్టోరీ. 18 పేజెస్ సినిమా కూడా అందరికీ నచ్చి ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది.
విభిన్నమైన క్యారెక్టర్‌లో…
ఇప్పటి వరకు నేను చేసిన లవ్ స్టోరీస్‌లో ఇది నా ఫేవరెట్ మూవీ. ‘18 పేజెస్’లో నందిని క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం అందరూ ఈ క్యారెక్టర్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పలేను. అది సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్రేమించడానికి కారణం ఉండదు…
ప్రేమ లేకుండా ప్రపంచమే లేదు. అలాగే భావోద్వేగాలు లేకుండా జీవితం ఉండదు. కాబట్టి ప్రేమ కథలు ఖచ్చితంగా ఉండాలి, ఉంటాయి. ఈ సినిమా కూడా 100 శాతం లవ్ స్టోరీ కాబట్టి అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా. మనకు తెలియకుండా జరిగే విషయమే లవ్. ప్రేమించడానికి కారణం ఉండదు. ఎందుకు ప్రేమిస్తున్నాను అంటే దానికి సమాధానం ఉండదు. అదే డైలాగ్ సినిమాలో పెట్టడం జరిగింది.
చాలా హ్యాపీగా ఉంది…
సుకుమార్ ‘రంగస్థలం’ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయినపుడు చాలా బాధపడ్డాను. మళ్ళీ ఇప్పుడు సుకుమార్ రైటింగ్స్‌లో నా క్యారెక్టర్‌ను డిజైన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అయన రైటింగ్స్‌లో ఇది నాకు సిగ్నేచర్ క్యారెక్టర్ అవుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News