Thursday, April 24, 2025

యదార్థ సంఘటనల ఆధారంగా అనుపమ కొత్త మూవీ…

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై జె.ఫణీంద్ర కుమార్ నిర్మాతగా ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ(జె.ఎస్.కె). యదార్థ సంఘటనల ఆధారంగా వాస్తవిక దృక్పధ కోణంలో తీసిన సినిమా ఇది. బైజు సందోష్, మాధవ్, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో జానకి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో జానకి తనపై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అన్న అంశాన్ని ఇంటెన్స్ డ్రామాగా నిర్మించారు. ఈ కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News