Friday, December 27, 2024

ప్రేమలో ఉన్న మాట వాస్తవమే: అనుపమ పరమేశ్వరన్

- Advertisement -
- Advertisement -

Anupama Parameswaran opens up about her love

మలయాళం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల కాలంలో చేస్తున్న సినిమాలు అలాగే కొన్ని విషయాలపై స్పందిస్తున్న విధానం కూడా చాలా విభిన్నంగా ఉంది. వీలైనంత వరకు గ్లామర్ రోల్స్‌కు చాలా దూరంగా ఉండే ఈ బ్యూటీ ఇటీవల రౌడీ బాయ్స్ సినిమాలో మాత్రం గతంలో ఎప్పుడూ లేనంతగా షాక్ ఇచ్చింది. ఏకంగా లిప్ లాక్ కిస్ ఇవ్వడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశంలో కూడా ఆమె కనిపించిన విధానం అందరిని కూడా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఇక అప్పుడప్పుడు అనుపమ పరమేశ్వరన్ లవ్ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇక ఈ బ్యూటీ తాజాగా తాను ప్రేమలో ఉన్న విషయాన్ని కూడా చాలా వివరంగా తెలియజేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తాను ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని ఆమె చెప్పడం విశేషం. తనది పూర్తిగా వన్ సైడ్ లవ్ అంటూ అవతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని ఎదురు చూస్తున్నట్లుగా చెప్పింది. అంతేకాకుండా ఫైనల్‌గా తాను మాత్రం ప్రేమ పెళ్లిని ఇష్టపడతాను అని… ఇప్పటికే అలాంటి జంటలను చూస్తూ ఉంటే చాలా ముచ్చటగా ఉంటుంది అని చెబుతోంది. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని. ఆ విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలుసు అని కూడా ఈ బ్యూటీ ఎలాంటి అనుమానాలు లేకుండా ఒక క్లారిటీ ఇచ్చింది.

Anupama Parameswaran opens up about her love

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News