దక్షిణాదిన ఇటు హీరోయిన్‌గా అటు కథానాయిక ప్రాధాన్య చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న అందాల తారా అనుపమ పరమేశ్వరన్. ముక్కుసూటి తనం ముగ్ద మనోహర రూపం ఆమె సొంతం. తాజాగా ఈ భామ ‘కార్తి కేయ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ బ్యానర్స్‌పై నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్బంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
కాన్సెప్ట్ నచ్చి చేశా…
దర్శకుడు చందు ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమాలోలో కృష్ణతత్త్వం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే నాకొచ్చిన కొన్ని ప్రాజెక్ట్‌ను కూడా వదులుకుని ఈ సినిమా చేశాను.
కథకు తగ్గట్టుగానే నా పాత్ర…
లొకేషన్స్ మారుతూ షూటింగ్ చేయడంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాగే మంచు గడ్డ కట్టే ప్రదేశంలో షూటింగ్ చేయడంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో నేను అందరూ జేమ్స్ బాండ్ టైప్‌లో ఎంట్రీ ఇచ్చావు అంటున్నారు. అలాగే కొన్ని చోట్ల హీరోను డామినేట్ చేసే విధంగా నా పాత్ర ఉంది అనడంలో వాస్తవం లేదు. అయితే కథకు తగినట్టుగానే నా పాత్ర ఉంటుంది.
పాత్రలు ఛాలెంజింగ్‌గా ఉండాలి
నేను ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాను. నాకొచ్చే పాత్ర లు ఛాలెంజింగ్‌గా ఉండా లి అలాంటి పాత్రలు నాకు నచ్చుతాయి. ఒక ఆర్టిస్ట్‌గా ఎన్ని లాంగ్వేజెస్ కుదిరితే అన్ని లాంగ్వేజెస్ చేయాలని ఉంటుంది.
తదుపరి చిత్రాలు…
ప్రస్తుతం నేను చేస్తున్న రెండు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. మరో రెండు చిత్రాలు చర్చల్లో ఉన్నాయి. అలాగే 18 పేజెస్ సినిమా వారం రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది.
Anupama Parameswaran special interview