Friday, December 20, 2024

చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. పార్లమెంటులో చర్చకు రండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్ హింసాత్మక సంఘటనలపై తక్షణమే పార్లమెంట్‌లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతుండడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిపై చర్చలో పాల్గొనాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని విపక్షాలకు అభ్యర్ధించారు. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దాడుల అంశాన్ని రాజకీయం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో సోమవారం సంయుక్తంగా నిరసన చేపట్టాలని విపక్ష పార్టీలు ప్రణాళిక సిద్ధం చేశాయి.

దీనిపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాత్రమే మాట్లాడతారని చెబుతోంది. రాష్ట్రం ఏదైనా మహిళలపై దాడులు జరగడం ఎంతో బాధాకరమని, ఇలాంటి సంఘటనలు నివారించే బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర మంత్రి ఠాకూర్ పేర్కొన్నారు. మణిపూర్, పశ్చిమబెంగాల్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

రాజకీయ పార్టీలన్నీ పాల్గొని ఈ అంశంపై సజావుగా చర్చించాలని తాము ఆశిస్తున్నామని , విపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానని అభ్యర్థించారు. చర్చ నుంచి ఎవరూ కూడా పారిపోవద్దని , దయచేసి పార్లమెంట్‌లో జరిగే చర్చలో పాల్గొనాలని కోరారు. ఇప్పటివరకు ఈ అంశంపై చర్చ జరపాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన విపక్షాలు, చర్చలో మాత్రం పాల్గొనేందుకు వెనుకాడుతున్నాయని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News