Friday, November 22, 2024

తండ్రయిన విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

Anushka and Kohli blessed with a baby girl

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తండ్రయ్యాడు. విరాట్ భార్య అనుష్క శర్మ సోమవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లి ట్వీటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. మా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ”ఈ రోజు మధ్యాహ్నం ఆడబిడ్డ జన్మనించిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ శుభసమయం కోసం నేను, నా భార్య, కుటుంబ సభ్యులు ఎంతో అతృతతో ఎదురు చూశాం. మా ఇంటిలోకి మహాలక్ష్మి రావడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మా జీవితంలోనే ఇది అత్యంత మధుర క్షణంగా మిగిలిపోతుంది. ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. అనుష్క, పాప ఇద్దరు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు” అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఇదిలావుండగా విరాట్ కోహ్లి దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భారత క్రికెట్ బోర్డుతో పాటు ఐసిసి అతనికి శుభాకాంక్షలు తెలిపాయి. అంతేగాక భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్, గంభీర్, కపిల్, గవాస్కర్ తదితరులు కూడా కోహ్లి దంపతులను అభినందిస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు పలువురు టీమిండియా సహచారులు కూడా సోషల్ మీడియా వేదికగా విరుష్క జంటకు శభాకాంక్షలు తెలిపారు.

Anushka and Kohli blessed with a baby girl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News