Monday, December 23, 2024

‘మిసెస్ కొహ్లీ’ అని పిలిచినందుకు అనుష్కా శర్మ రియాక్షన్!

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ నటి అనుష్కా శర్మను పపరాజీలు ‘మిసెస్ కొహ్లీ’ అని సంబోధించినందుకు ఆమె బుగ్గలు ఉబ్బిపోయి ఎరుపెక్కాయి. తర్వాత ఆమె ‘రిలాక్స్! ఎందుకలా అరుస్తారు? ఆగండి! అబ్బా నా చెవులు…నిన్నటి మీ అరుపులకే ఇంకా కోలుకోలేదు’ అని చెప్పింది.

ఈవెంట్లలో ఆమె ఫోటోలు మిస్సయామని ఫోటోగ్రాఫర్లు అన్నారు. దానికామె ‘ నా చెవులలో మీ మాటలు గింగిర్లు కొడుతున్నాయి’ అంది. అనుష్క శర్మ తన అనుష్కా శర్మ ఫౌండేషన్‌ను, విరాట్ కోహ్లి ఫౌండేషన్‌తో కలిపేసే ఈవెంట్‌లో ఫోటోగ్రాఫర్ల ఒత్తిడిని ఎదుర్కొన్నారు. వారిద్దరి ఫౌండేషన్లను ఒకటి చేసి వారు ఆపన్నులను ఆదుకుంటున్నారు.
ప్రస్తుతం అనుష్క శర్మ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ అనే నెట్‌ఫ్లిక్స్ సినిమాలో నటిస్తున్నారు. అది మహిళా క్రికెటర్ ‘ఝులాన్’ జీవితంపై తీసింది. ఝులాన్ జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్ కూడా అయింది. 2018లో ఆమె గౌరవార్ధం పోస్టేజ్ స్టాంప్‌ను కూడా విడుదలచేశారు. అంతర్జాతీయ కేరీర్‌లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌గా ఝులాన్‌ గోస్వామికి పేరుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News