హైదరాబాద్: మూడోసారి ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి టీమిండియా రికార్డు సృష్టించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ గెలవడంతో దేశ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. క్రికెట్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ఆనందంలో మునిగిపోయారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ గెలిచిన వెంటనే విరాట్ కోహ్లీ తన సతీమణికి హగ్ ఇచ్చాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అనుష్క శర్మ హగ్ ఇచ్చింది. ఆప్యాయంగా హత్తుకొని అతడిని అభినందించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇది గెలుపు తెచ్చిన ఆనందం అని, ఇవి అపురూపమైన క్షణాలు అని కొనియాడారు. రవీంద్ర జడేజా తన భార్య, కూతురు ఆనంద క్షణాలు గడిపారు. శుభ్ మన్ గిల్ తన కుమారుడు ఐసిసి ట్రోఫీ గెలిచినందుకు హర్షం వ్యక్తం చేశాడు.