Tuesday, January 21, 2025

అనుష్క ఫ్యాన్స్కు సర్ప్రైజ్.. ‘ఘాటి’ ఫస్ట్లుక్ అరాచకం..

- Advertisement -
- Advertisement -

సీనియర్ హీరోయిన్ అనుష్క తన అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె డైరెక్టర్ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సిినమాకు ఘాటి అనే టైటిల్ ను ప్రకటించారు. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. గురువారం అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు.

ఇందులో రక్తంతో తడిసిన చేతితో సుట్టా పీలుస్తూ సిరియస్ గా చూస్తున్న పోస్టర్ అదిరిపోయింది. అనుష్క లుక్ అరాచకంగా ఉందనే చెప్పాలి. ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మిస్టర్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News