Tuesday, January 21, 2025

తన నవ్వే జబ్బు గురించి వివరించిన నటి అనుష్క శెట్టి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నవ్వడం కూడా జబ్బేనా అంటే…కొందరి విషయంలో అవుననే చెప్పాలి. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. ప్రముఖ నటి అనుష్క శెట్టికి ఈ అరుదైన ‘లాఫింగ్ డిసీజ్’(నవ్వే జబ్బు) ఉంది. ఆమె నవ్వడం మొదలుపెడితే 15 నుంచి 20 నిమిషాల వరకు ఆపుకోలేదు. ‘‘నేను షూటింగ్ లో కామెడీ సీన్స్ చేసేప్పుడు లేక చూసేప్పుడు నిజంగానే నేలపై నవ్వుతూ పొర్లాడిపోతాను. అనేక సందర్భాలలో షూటింగ్ కూడా నా వల్ల ఆగిపోయింది’’ అని ఆమె ఓ మ్యాగజైన్ కు తెలిపింది.

నవ్వే జబ్బును మెడికల్ పరిభాషలో ‘సూడోబల్బర్’ అని పిలుస్తారని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. ఈ జబ్బు లక్షణాలు:

  • ఉన్నట్టుండి నవ్వడం లేక ఏడ్వడం
  • ఈ జబ్బున్న వారికి నవ్వు లేక ఏడ్పు వస్తే మాత్రం అది 15 నుంచి 20 నిమిషాల వరకు కొనసాగుతుంది.

డాక్టర్  కుమార్ నవ్వడం మామూలు విషయంలా అక్కడ ఉండే వారికి అనిపిస్తుంది. కానీ నవ్వే జబ్బు ఉన్నవారికే తెలుస్తుంది అదెంతా తమకు ఇబ్బందికరమో. అయితే ఈ నవ్వే జబ్బును మానసిక జబ్బుగా భావించరాదని డాక్టర్ కుమార్ స్పష్టం చేశారు. నవ్వే జబ్బు మూడ్ కు సంబంధించిన ఓ వ్యాధి మాత్రమేనన్నారు. “చాలా సందర్భాలలో, స్పష్టమైన మెదడు లేదా నరాల వ్యాధిగా కనబడదు. ఈ సందర్భాలలో, ఈ పరిస్థితి న్యూరోట్రాన్స్‌మిటర్‌లలో అసమతుల్యతకు సంబంధించినదిగా భావించబడుతుంది, దీని ఫలితంగా సెరెబ్రో-పాంటో-సెరెబెల్లార్ పాత్‌వేస్ వంటి మెదడు నాడీ మార్గాలు పనిచేయకపోవడం జరుగుతుంది” అని కుమార్ వివరించారు.

Laughing disorder

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News