Tuesday, January 21, 2025

నటి అనుష్కకు ‘లాఫింగ్ డిసీజ్’ అనే వింత జబ్బు!?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేడు నటీమణులలో చాలా మందికి ఎవరూ ఊహించని, ఏవేవో జబ్బులు వస్తున్నాయి. సమంత, శృతి హాసన్… మైయోసైటీస్, పిసిఓఎస్ అనే జబ్బులతో బాధపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి కొత్త జబ్బులు వచ్చాయి. అయినప్పటికీ వారేమాత్రము ఢీలా పడిపోకుండా గుండె ధైర్యంతో ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ‘బాహుబలి’ ఫేమ్ అనుష్కకు కూడా ఓ వింత జబ్బు ఉందని వినికిడి. అదేమిటంటే ఆమెను ఎవరూ నవ్వించొద్దట. నవ్విస్తే ఇక అంతే సంగతులు….

అనుష్కకు వచ్చింది అలాంటిలాంటి జబ్బు కాదు. మహా వింత జబ్బు. ఆమెను నవ్వించొద్దు. నవ్విస్తే మాత్రం సమస్యే. ఆమె నవ్విందంటే 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వేస్తుందట. పైగ నవ్వాపుకోలేక నేలపై పొర్లాడుతుందట. కామేడీ సీన్ చూసినా, నటించినా నవ్వుతూ పొర్లాడుతుందట. అంత అందం, అణకువ ఉన్న ఆమెకు ఈ వ్యాధి ఉందంటే ఎవరూ నమ్మలేరు. కానీ వాస్తవం అదే. ఆమెది ‘లాఫింగ్ డిసీజ్’ అట. కానీ ఈ కారణంగా సహచర నటులు, ఇతర సిబ్బంది టీ, స్నాక్స్‌కు బ్రేక్ తీసుకుంటారట. పైగా వారు తమకు విరామం కల్పించినందుకు ఆమెకు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటారట.

అనుష్క ఇదివరలో త్రిభాష చిత్రం ‘సైలెన్స్’ లో నటించింది. అందులో మాధవన్, అంజలి, మైఖేల్ మాడ్సన్ నటించారు. అందులో ఆమె మాట్లాడలేని పాత్రను పోషించింది. ఆమె నటనను చాలా మంది మెచ్చుకున్నారు కూడా. అయితే దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆమె ‘అనుష్క 48’ లో నటించబోతుంది. దానికి మహేశ్ బాబు పి దర్శకుడు. ‘జాతి రత్నాలు’ సినిమా ఫేమ్ నటుడు నవీన్ పొలిశెట్టి ఆమెతో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News