Friday, November 22, 2024

అతడుగా మారిన ఆమె

- Advertisement -
- Advertisement -

దేశ చరిత్రలో మొదటిసారిగా ఓ ఐఆర్‌ఎస్ అధికారిణి అధికారికంగా తన లింగాన్ని, పేరును మార్చుకోడానికి ప్ర భుత్వం అనుమతించింది. పుట్టుకతో స్త్రీగా పరిగణించిన తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను ఆ అధికారిణి అభ్యర్థించగా ప్రభుత్వం అంగీకరించింది. చెన్నైకు చెందిన 35 ఏళ్ల ఐఆర్‌ఎస్ అధికారి ఎం. అనసూయ ప్రస్తుతం హైదరాబాద్ లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యా క్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్( అధీకృత ప్రతినిధి) కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన పేరును ఎం. అనుకతిర్ సూ ర్యగా , లింగాన్ని స్త్రీకు బదులు పురుషుడిగా మార్చాలని ఆర్థిక మంత్రిత్వశాఖను కోరారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఈ విధంగా పేర్కొంది. “ఇటీవల మాకు ఓ విన్నపం అందింది. 2013 బ్యా చ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారిణి అనసూయ ప్రస్తుతం హైదరాబాద్ లోని కస్టమ్స్ ,

ఎక్సయిజ్, అండ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (సిఇఎస్‌టిఎటి) చీఫ్ కమిషనర్ (ఎఆర్) కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తనకు సంబంధించిన అన్ని ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన పేరును , లింగాన్ని మార్చాల్సిందిగా అభ్యర్థించారు. అన్ని అధికారిక రికార్డుల్లో మార్పులు చేసి ఇకపై ఆమెను పురుషుడిగా పరిగణిస్తున్నాం ” అని వెల్లడించింది. అనసూయ చెన్నై లోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. 2013 లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా తన వృత్తిని ప్రారంభించిన ఐఆర్‌ఎస్ అధికారి అనసూయ 2018లో డిప్యూటీ కమిషనర్ ర్యాంకుకు పదోన్నతి పొందారు. 2023లో భోపాల్ లోని నేషనల్‌లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్శిటీ నుంచి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పొందారు. గత ఏడాది హై దరాబాద్ లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (సిఇఎస్‌టిఎటి) చీఫ్ కమిషనర్ (అధీకృత ప్రతినిధి) కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా విధుల్లో చేరారు.

2014లో ఒడిశాలో వాణిజ్యపన్ను అధికారి లింగమార్పిడి
లింగమార్పిడికి సంబంధించిన నల్సా కేసు 2014లో సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది. ఒడిశాకు చెందిన ఓ వాణిజ్య పన్ను అధికారి విధుల్లో చేరిన ఐదేళ్ల తరువాత తాను లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నానని, తనను స్త్రీగా గుర్తించాలని కోరారు. ఈ కేసులో సుప్రీం తీర్పును వెల్లడిస్తూ వ్యక్తులు తాము పురుషులుగా ఉండాలా , స్త్రీగా ఉండాలా అనేది వారి వ్యక్తిగత విషయమని పేర్కొంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించడంతో ఆ అధికారి తన పేరును ఐశ్వర్య రీతుపర్ణ ప్రధాన్‌గా అధికారిక రికార్డుల్లో మార్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News