Sunday, September 8, 2024

చెఫ్ అన్విత రవళి శెట్టిగా…

- Advertisement -
- Advertisement -

 

యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి, అందాల తార అనుష్క శెట్టి హీరో హీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది ఈ సినిమా. సోమవారం అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ చిత్రంలో పోషిస్తున్న అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆమె కిచెన్‌లో డెలిషియస్ ఫుడ్ సిద్ధం చేస్తున్నట్టు ఉంది ఈ లుక్. ఈ స్పెషల్ పోస్టర్‌లో అనుష్కకు బర్త్ డే విషెస్ తెలిపారు. వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్‌లో మంచి అంచనాలున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News