Sunday, January 19, 2025

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా దేశ పార్లమెంట్ సభ్యులు (సెనేటర్) అయిన అన్వర్ ఉల్ హక్ కాకర్ నియమితులు అయ్యారు. ఇటీవలే దేశ పార్లమెంట్ రద్దు అయింది. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. నిబంధనల ప్రకారం పదవి నుంచి నిష్క్రమించే ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, ప్రతిపక్ష నేత రజా రియాజ్‌లు అన్వర్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా ఎంపిక చేసే విషయంలో అంగీకారానికి వచ్చారు. ఈ కేర్‌టేకర్ పిఎం ఆధ్వర్యంలోనే పాకిస్థాన్‌లో ఎన్నికలు జరుగుతాయని ప్రధాన మంత్రి కార్యాలయం వర్గాలు తెలిపాయి.

బెలూచిస్థాన్‌కు చెందిన ఈ సెనెటర్ రాజకీయంగా పెద్దగా తెలిసిన వ్యక్తి గా చలామణి కాలేదు. ఇప్పుడు ఆపద్ధర్మ ప్రధాని అవుతోన్న ఆయన త్వరలోనే కేబినెట్‌ను, నూతన ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. తరువాత ఎన్నికల నిర్వహణ కూడా ఆయన హయాంలోనే జరగాల్సి ఉంటుంది. ఆపదర్మ ప్రధాని ఎంపికకు సంబంధించి ప్రధాని, ప్రతిపక్ష నేత సంయుక్తంగా వెలువరించిన సలహా , సంబంధిత పత్రాలను దేశ అధ్యక్షుల ఆమోదానికి పంపిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News