Monday, December 23, 2024

పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హఖ్ కాకర్ ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా 52 ఏళ్ల అన్వర్ ఉల్ హఖ్ కాకర్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇస్లామాబాద్ లోని అధ్యక్షుడి నివాసం ఐవాన్ ఇ సదర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతోఅన్వర్ పాకిస్థాన్‌కు 8 వ తాత్కాలిక ప్రధాన మంత్రి అయ్యారు. అంతకు ముందే అన్వర్ పార్లమెంట్ ఎగువ సభకు రాజీనామా చేశారు.

సెనేట్ ఛైర్మర్ సాదిక్ సంజరాణి సోమవారం ఆ రాజీనామాను ఆమోదించారు. ఈ సందర్భంగా తాను నెలకొల్పిన బలూచిస్థాన్ అవామీ పార్టీ కి (బిఎపి) కూడా అన్వర్ రాజీనామా చేయడం గమనార్హం. ఎన్నికల సంఘం సహకారంతోసార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం తన బాధ్యతగా భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News