Monday, December 23, 2024

ఎమ్మార్పీ ధరకే వస్తువుల విక్రయం

- Advertisement -
- Advertisement -

Any item on railway station platforms at MRP price

ఆగష్టు 01వ తేదీ నుంచి అన్ని రైల్వేస్టేషన్‌లలోని
హోటళ్లు, స్టాల్స్, ఫుడ్ ప్లాజాలు, రెస్టారెంట్‌లలో క్యాష్‌లెస్ చెల్లింపునకు శ్రీకారం
అధిక ధరలకు వస్తువులను విక్రయించకుండా రైల్వే శాఖ తాజా నిబంధనలు అమల్లోకి…

మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలపై ఏ వస్తువునైనా ఎమ్మార్పీ ధరకే స్టాళ్ల నిర్వాహకులు విక్రయించేలా రైల్వే శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. రైల్వే స్టేషన్లలో అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్నారన్న ప్రయాణికుల ఆరోపణల నేపథ్యంలో ఈ విధానం ద్వారా దానికి అడ్డుకట్ట వేయవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది. అందులో భాగంగా ఆగస్టు 1 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలో క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఆగస్టు 1 నుంచి రైల్వేస్టేషన్లో క్యాటరింగ్‌తో సహా అన్ని స్టాల్స్‌లో నగదుకు బదులుగా డిజిటల్ పద్ధతిలో డబ్బును నిర్వాహకులు స్వీకరించనున్నారు. నగదు రహిత బదిలీలను అంగీకరించని స్టాల్స్ నుంచి రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని రైల్వే అధికారులు ఇప్పటికే నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు.

దీని కోసం యూపిఐ, పేటిఎం, పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్లు, స్వైపింగ్ మెషీన్లను కలిగి ఉండాలని అన్ని షాపుల యజమానులను రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ప్రయాణికులకు కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాలని సూచించింది. ఇప్పటివరకు రూ.15లు ఉన్న వాటర్ బాటిల్‌కు రూ.20లను నిర్వాహకులు వసూలు చేసేవారు. ప్రస్తుతం వచ్చేనెల నుంచి క్యాష్ లెస్ చెల్లింపులతో ఇకపై ఎక్కువ ధరకు ఎవరూ విక్రయించలేరు. క్యాటరింగ్ క్యాష్ లెస్ చెల్లింపులపై గతంలో రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేలు, ఐఆర్‌సిటిసికి ఆదేశాలు జారీ చేసింది. ట్రాలీలు, ఫుడ్ ప్లాజాలు, రెస్టారెంట్‌లు మొదలైన వాటిలో కూడా ఈ నగదు రహిత లావాదేవీలు జరుగుతాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News