Wednesday, January 22, 2025

స్ట్రోక్ నుంచి కోలుకున్నా.. కొన్ని జాగ్రత్తలు పాటించాలి

- Advertisement -
- Advertisement -

స్ట్రోక్ నుంచి త్వరగా కోలుకోవడంలో ఆహారం కీలక పాత్ర వహిస్తుంది. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్ , ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే హైపర్‌టెన్షన్ కంట్రోల్‌లో ఉంటుంది. కొలెస్టరాల్ స్థాయిలు తగ్గుతాయి. స్ట్రోక్ వచ్చినవారు ఉప్పు వేయించిన ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

ఎక్సర్‌సైజ్ వల్ల కండరాల బలం, సమన్వయం, సమతుల్యత, చలనశీలత మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. ఇది హైపర్‌టెన్షన్, అధికబరువు, డయాబెటిస్ వంటి ప్రమాద కారకాలను తగ్గించి, భవిష్యత్తులో స్ట్రోక్ రాకుండా నివారిస్తుంది. ఒత్తిడి తగ్గించుకోవాలి. శ్వాస లోతుగా తీయడం, ధ్యానం, యోగా, సంగీతం వినడం, వంటి పనులు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి ఆందోళన తగ్గించి, నిద్ర నాణ్యతను మెరుగుపర్చడానికి సహాయపడతాయి. రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. స్ట్రోక్ నుంచి కోలుకుంటున్నవారు ప్రతిరోజూ రాత్రి 78 గంటల పాటు నిద్ర పోవాలి. పగటిపూట నిద్ర పోకూడదు. స్మోకింగ్ మానేయాలి. స్మోకింగ్ మానేస్తే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News