Tuesday, December 24, 2024

యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని మున్సిపల్ చైర్మన్ దాసరి మమత అన్నారు. శుక్రవారం ట్రినిటి ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన యువ ఉత్సవ్ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దాసరి మమతలు ముఖ్యఅతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ యువత మన దేశంలోనే అత్యధికంగా ఉన్నారని అన్నారు. నేటి యువకులు మంచి విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగ, సంగీత తదితర అంశాల్లో నిష్ణాతులై ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం పొందాలని పేర్కొన్నారు. క్రమశిక్షణతో ఒక లక్షాన్ని ఏర్పరుచుకొని కష్టపడి ముందుకు సాగితే వారి కుటుంబానికి, దేశానికి ఉత్తమ పౌరులుగా తయారవుతారని అన్నారు.

అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రశంసా పత్రాలు, జ్ఞాపకలు అందజేశారు. మోబైల్ పోటోగ్రఫీ పోటీలకు ప్రథమ బహుమతి రూ.వెయ్యి, ద్వితీయ బహుమతి రూ.750, తృతీయ రూ.500, ఉపన్యాస పోటీకి ప్రథమ బహుమతి రూ.5 వేలు, ద్వితీయ రూ.2 వేలు, తృతీయ బహుమతి రూ.వెయ్యి, గ్రూపు సాంస్కృతిక పోటీలకు ప్రథమ రూ.5 వేలు, ద్వితీయ రూ.2500, తృతీయ బహుమతులు రూ.1250లు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి వెంకట్ రాంబాబు నెహ్రూ యువ కేంద్రం కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రినిటి కళాశాల ఏఓ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ ప్రభాకర్, నెహ్రూ యువ కేంద్ర ప్రొగ్రాం అధికారి బసవపత్రి రవీందర్, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు ఈదునూరి శంకర్, కొండ రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News