Monday, December 23, 2024

మోడీతో ఏదైనా సాధ్యమే : కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో మహిళా లోకానికి ఓ కానుక లభించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. చారిత్రాత్మకమైన, ప్రగతిశీలమైన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఇది దేశ చరిత్రలో ఓ కీలకమైన మలుపుగా నిలవబోతోందన్నారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో చాలాసార్లు ఈ బిల్లు గురించి చర్చ జరిగింది. పార్లమెంటులోనూ పలుమార్లు ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఓ సారి ఆమోదం పొందింది. కానీ ఈ బిల్లు విషయంలో అంతకుమించి ఒక్క అడుగుకూడా ముందుకు పడకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలే అని ఆరోపించారు.

ఈ బిల్లుతో లోక్‌సభలో, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల కోసం సీట్లు రిజర్వ్ కాబోతున్నాయి. ఈ అద్భుతమైన ప్రగతి సాధించినందుకు దేశ మహిళాలోకానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ చారిత్రాత్మకమైన బిల్లు లోక్‌సభలో ఆమోదముద్ర పొందడం ద్వారా.. ‘మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే’ అని మరోసారి నిరూపితమైందన్నారు.ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News